రకాలు
బల్వంత్ (ఎన్.ఎ.-1౦):
కాయలు మధ్యస్తం నుండి పెద్ద పరిమాణంలో ఆకర్షనీయంగా వుంటాయి. బరువు 41 గ్రాములు ఉంటుంది. కాయలు గుండ్రంగా వుండి చర్మం గరుకుగా లేత ఆకుపచ్చని రంగులో పింక్ వర్ణం మిళితమై వుంటుంది. అయిదారు సంవత్సరాల చెట్ల నుండి 42 కిలోల దిగుబడి వస్తుంది. 1౦౦ గ్రాముల కాయ గుజ్జులో 528 మిల్లి గ్రాముల విటమిన్ సి వుంటుంది.
నీలం (ఎన్.ఎ.-7):
కాయలు మధ్యస్తం నుండి పెద్ద సైజులో ఉంటాయి. బరువు - 46 గ్రాములు. చర్మం నున్నగా వుండి, పండులోని కండ మెత్తగా పీచు లేకుండా వుంటుంది. ఈ రకం నేక్రోసిస్ వ్యాదికి తట్టుకుంటుంది. అయిదారు సం.ల చెట్ల నుండి 5౦ కిలోల దిగుబడి వస్తుంది. 100 గ్రాముల గుజ్జులో 788 మిల్లి గ్రాముల విటమిన్ ‘సి’ వుంటుంది.
అమ్రిత్ (ఎన్ . ఎ. – 6):
కాయలు మధ్యస్తంగా, నునుపైన చర్మంతో 6 చారలు కలిగి ౩5 – ౩7 గ్రాముల బరువు కలిగి వుంటాయి. జాం, క్యాండీ వంటి పదార్ధం తయారికి అనుకూలం. అయిదారు సంవత్సరాల చెట్ల నుండి ౩5 – 40 కిలోల దిగుబడి వస్తుంది. 100 గ్రాముల గుజ్జులో 707 మిల్లి గ్రాముల విటమిన్’సి’ వుంటుంది.
కాంచన్ (ఎన్.ఎ.-4):
పసుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగిన కాయలు, మధ్యస్తంగా వుంది, ౩0 – ౩2 గ్రాముల బరువు కలిగి వుంటాయి. కాయలు కార్కింగ్ తట్టుకోలేవు. 10౦ గ్రాముల కాయగుజ్జులో 711 మిల్లి గ్రాముల విటమిన్- ‘సి’ వుంటుంది. ఐదారు సంవత్సరాల చెట్ల నుండి ౩0 – ౩8 కిలోల దిగుబడి వస్తుంది. ఉరగాయకు ఎక్కువ కాలం నిలువ వుంచగలిగిన రకం.
కృష్ణ (ఎన్.ఎ.-5);
కాయలు మధ్యస్తంగా, ౩5 గ్రాముల బరువు కలిగి వుంటాయి. 100 గ్రాముల గుజ్జులో 549 మిల్లి గ్రాముల విటమిన్ ‘సి’ వుంటుంది. ఐదారు సంవత్సరాల చెట్ల నుండి ౩౦-౩5 కిలోల దిగుబడి వస్తుంది (వర్షాధారంగా).
చక్కియా;
తెలుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగిన కాయలు, మధ్యస్తంగా ౩౩-౩5 గ్రా. బరువు కలిగి వుంటాయి. ఎక్కువ పీచు వుండి 100 గ్రాముల కాయగుజ్జులో 789 మిల్లి గ్రాముల విటమిన్ – ‘సి’ వుంటుంది. నిటారుగా పెరిగే లక్షణం వుండటం వల్ల దీనిని అధిక సాంద్రత ఉన్న చోట కూడా నాటవచ్చు. ఐదు సంవత్సరాల చెట్ల నుండి ౩౦ కిలోల దిగుబడి వస్తుంది. ఈ రకం పరపరాగ సంపర్కానికి బాగా అనుకూలం. పచ్చళ్ళ తయారీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది.
బి.ఎస్.ఆర్. -1;
ఇది తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంచే రూపొందించింది. ఇది అన్ని ప్రాంతాల్లో పండించేందుకు అనుకూలం. కాయ సైజు చిన్నగా వుండి పింక్ రంగులో వుంటుంది. 12 – 14 గ్రాముల వరకు బరువు ఉంటుంది. 100 గ్రాముల కాయ గుజ్జులో 650 మిల్లి గ్రాముల విటమిన్ ‘సి’ వుంటుంది. ఐదు సంవత్సరాల చెట్టు 40 – 45 కిలోల ఉత్పత్తినిస్తుంది. 10 సంవత్సరాల వయస్సులో దిగుబడి 15౦ కిలోల చేరుకుంటుంది.
లక్ష్మి - 52:
కాయలు 40 – 60 గ్రాముల బరువుంటాయి. 100 గ్రాముల కాయగుజ్జులో 512 మిల్లి గ్రాముల విటమిన్ ‘సి’ వుంటుంది. ఈ రకం క్యాండీ, మురబ్బ తయారికి అనువైనది. 1౦ సంవత్సరాల వయసు చెట్ల నుండి 200 – 250 కిలోల దిగుబడి వస్తుంది. |